logo

పడకల్లేక పాట్లు..

ఒకే మంచంపై ముగ్గురు విద్యార్థినులు పడుకొని ఉన్న దృశ్యం నందిగాం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్యకేంద్రంలో శనివారం కనిపించింది. స్థానిక అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు జ్వరంతో బాధపడటంతో వైద్య పరీక్షలకు ఉపాధ్యాయిని వారిని పీహెచ్‌సీకి తీసుకొచ్చారు

Published : 07 Aug 2022 04:25 IST

ఒకే మంచంపై ముగ్గురు విద్యార్థినులు పడుకొని ఉన్న దృశ్యం నందిగాం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్యకేంద్రంలో శనివారం కనిపించింది. స్థానిక అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు జ్వరంతో బాధపడటంతో వైద్య పరీక్షలకు ఉపాధ్యాయిని వారిని పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. వీరిలో ఓ విద్యార్థినికి సెలైన్‌ ఎక్కించడానికి ఓ మంచం కేటాయించారు. ఆసుపత్రిలో 2 మంచాలే ఉండడంతో మరో మంచంపై మిగిలిన ముగ్గురు విద్యార్థినుల్ని పడుకోబెట్టారు. ఆసుపత్రిలో కేవలం రెండు మంచాలే ఉండడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తిందని వైద్యాధికారిణి అనిత వివరించారు.

- న్యూస్‌టుడే, నందిగాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని