logo

త్యాగనిరతికి ప్రతీక మొహర్రం

జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు మొహర్రంను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇస్లాంలో మొహర్రం మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇస్లాం మత స్థాపకులు, చివరి ప్రవక్త అయిన హజరత్‌ మహమ్మద్‌ మనుమడు ఇమామ్‌ హుస్సేన్‌ ధర్మ స్థాపనకు ఈ నెలలోనే ప్రాణత్యాగం చేశారు. ధర్మపరిరక్షణ

Published : 10 Aug 2022 04:08 IST

జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు మొహర్రంను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇస్లాంలో మొహర్రం మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇస్లాం మత స్థాపకులు, చివరి ప్రవక్త అయిన హజరత్‌ మహమ్మద్‌ మనుమడు ఇమామ్‌ హుస్సేన్‌ ధర్మ స్థాపనకు ఈ నెలలోనే ప్రాణత్యాగం చేశారు. ధర్మపరిరక్షణ, శాంతి సమైక్యతల పరిపుష్టి, మానవత, సేవానిరతికి ప్రతీకగా నిలిచిన ఆయన త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు నివాళులర్పిస్తారు. వివిధ ప్రాంతాల్లో పీర్లను నెలకొల్పి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇమామ్‌ హుస్సేన్‌ వీరగాథను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని జామియా మసీదులో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేశారు. జెండాల వీధిలో పీర్లను అలంకరించారు. అదే ఈ చిత్రం. 

 - న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని