logo

హానికర పోకడలకు అడ్డుకట్ట వేయాలి

స్వాతంత్య్ర పోరాట విలువలన్నింటికి విఘాతం కలిగిస్తూ దేశాన్ని వెనక్కి నడిపే హానికర పోకడలకు అడ్డుకట్ట వేయడమే నాటి యోధులకు మనమిచ్చే నిజమైన నివాళి అని సీపీఎం జిల్లా నాయకులు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీపీఎం ఆధ్వర్యంలో ప్రచార జాతలు నిర్వహించారు. రణస్థలం

Published : 10 Aug 2022 04:08 IST

శ్రీకాకుళంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా నాయకులు జి.సింహాచలం, చిత్రంలో ఇతర నాయకులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: స్వాతంత్య్ర పోరాట విలువలన్నింటికి విఘాతం కలిగిస్తూ దేశాన్ని వెనక్కి నడిపే హానికర పోకడలకు అడ్డుకట్ట వేయడమే నాటి యోధులకు మనమిచ్చే నిజమైన నివాళి అని సీపీఎం జిల్లా నాయకులు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీపీఎం ఆధ్వర్యంలో ప్రచార జాతలు నిర్వహించారు. రణస్థలం నుంచి బయలుదేరిన ఒక జాత వాహనాన్ని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి ప్రారంభించారు. ఇది ఎచ్చెర్ల, జి.సిగడాం, పొందూరు, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం వరకు సాగింది. ఆ నాయకులు జిల్లా కేంద్రంలో రాత్రి బస చేశారు. ఇచ్ఛాపురంలో బయలుదేరిన మరో జాతను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తులసీదాస్‌, జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ప్రారంభించారు. వారు కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో పర్యటించారు. కొత్తూరు నుంచి మరో జాత బుధవారం బయలుదేరుతుంది.

భారాలు వేయడమే అమృత మహోత్సవమా?

జీపు జాత శ్రీకాకుళం చేరుకున్న తరువాత ఎన్‌జీవో హో వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతతత్వం, నిరంకుశత్వంపై ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్లు రాయితీలను ఇచ్చి, పేద వర్గాలపై భారాలను వేయడమే ఆజాదీకా అమృత మహోత్సవమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ఒక్కొక్కటిగా కారుచౌకగా అమ్మేసి మరోవైపు దేశభక్తి అని ప్రచారం చేయడమేంటన్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే చర్యలు ఆపాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు జి.సింహాచలం, పి.తేజేశ్వరరావు, టి.తిరుపతిరావు, డి.రమణారావు బి.మోహనరావు, ఎం.ఆదినారాయణ మూర్తి, సీహెచ్‌.అమ్మన్నాయుడు, సోమశేఖర్‌, పార్వతీశం, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని