logo

‘మిలీనియం మార్చ్‌’ విజయవంతం చేయాలి

సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో సెప్టెంబరు ఒకటో తేదీన మిలీనియం మార్చ్‌ కార్యక్రమం నిర్వహించనున్నామని, దాన్ని విజయవంతం చేయాలని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలకోన్నత పాఠశాల ఆవరణలో

Published : 10 Aug 2022 04:08 IST

గోడపత్రికను విడుదల చేస్తున్న ఏపీసీపీఎస్‌ఈఏ ప్రతినిధులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో సెప్టెంబరు ఒకటో తేదీన మిలీనియం మార్చ్‌ కార్యక్రమం నిర్వహించనున్నామని, దాన్ని విజయవంతం చేయాలని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలకోన్నత పాఠశాల ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను మంగళవారం విడుదల చేశారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ధర్మపోరాటం విజయవంతమైందన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన దానికి అనుగుణంగా తక్షణమే సీపీఎస్‌ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సెప్టెంబరు 1న పెద్దఎత్తున విజయవాడకు తరలిరావాలన్నారు. ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిన జీపీఎస్‌ను ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు టి.సూర్యారావు, ఆర్‌.సూరిబాబు, రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శి కె.రాజేశ్వరరావు, జిల్లా నాయకులు కె.సాయిరమేష్‌, వి.వి.రాజు, కె.శంకరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు