logo

అక్టోబరు 2 నాటికి రైతులకు పాసు పుస్తకాలు

వై.ఎస్‌.ఆర్‌. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీసర్వే దాదాపు పూర్తవుతుందని, అక్టోబరు 2వ తేదీ నాటికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల పరిధిలోని 400 గ్రామాల్లోని రైతులకు భూహక్కు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు

Published : 12 Aug 2022 05:04 IST

ముఖ్యమంత్రి సలహాదారు అజయ్‌ కల్లాం

మూడు జిల్లాల అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి సలహాదారు అజయ్‌ కల్లాం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: వై.ఎస్‌.ఆర్‌. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీసర్వే దాదాపు పూర్తవుతుందని, అక్టోబరు 2వ తేదీ నాటికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల పరిధిలోని 400 గ్రామాల్లోని రైతులకు భూహక్కు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి సలహాదారు, వై.ఎస్‌.ఆర్‌. జగనన్న శాశ్వత భూహక్కు, భూసరక్ష పథకం, రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీ ఛైర్మన్‌ అజయ్‌కల్లాం తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో భూసర్వేపై శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.  చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమం పూర్తయితే 90 శాతం భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు అధిగమించి రీసర్వే పనులు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. 1983 తర్వాత రెవెన్యూ దస్త్రాలు సక్రమంగా లేక రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికే ఈ రీసర్వే అన్నారు.  సర్వే సెటిల్‌మెంట్స్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ మాట్లాడుతూ డ్రోన్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15 నాటికి ప్రతి జిల్లాకు అదనంగా మరో 15 చొప్పున అందిస్తామన్నారు. సెప్టెంబరు నాటికి సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1,466 రెవెన్యూ గ్రామాల పరిధిలో 9.86 లక్షల ఎకరాల్లో  సర్వే చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సర్వే సెటిల్‌మెంట్స్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాసులు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరు నిశాంత్‌కుమార్‌, జేసీలు ఎం.విజయసునీత, ఎ.ఆనంద్‌, కె.మయూర్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని