logo

ఇది అక్రమార్కుల పాలన

రాష్ట్రంలో అక్రమార్కుల పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న ఆరోపించారు. గురువారం పలాస, శ్రీకాకుళం నగరంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు

Published : 12 Aug 2022 05:04 IST

తెదేపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న ఆరోపణ

శ్రీకాకుళం: ‘బాదుడే బాదుడు’లో కరపత్రం అందిస్తున్న వెంకన్న, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, ఇతర నాయకులు

కాశీబుగ్గ, గుజరాతీపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అక్రమార్కుల పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న ఆరోపించారు. గురువారం పలాస, శ్రీకాకుళం నగరంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అక్రమార్కులేనని ఆరోపించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు రాజకీయాలు, పదవులకు ఉన్న విలువ తెలియదన్నారు. ఒకేసారి 150 మందిని తిరుపతి వీఐపీ దర్శనానికి తీసుకెళ్లడంతో 15 వేల మంది భక్తులు ఇబ్బంది పడ్డారన్నారు. ప్రతిపక్షాలకు ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారం తప్ప ఇతర విషయాలు పట్టవా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించడం అర్థరహితమని బుద్దా పేర్కొన్నారు. మంత్రి పదవి రాక ముందు జగన్‌ను విమర్శించిన ధర్మాన నేడు పదవి ఇచ్చాక మాటమార్చారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ  స్వాతంత్య్ర సమరయోధుల గురించి హేళన చేసి మాట్లాడితే తాట తీస్తామన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తుంటే పోలీస్‌ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎంపీ మాధవ్‌ వ్యవహారంలో అనంతపురం ఎస్పీ మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని