logo

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

ఎచ్చెర్ల సాయుధ పోలీసు దళంలోని పాడుబడిన క్వార్టర్స్‌లో గురువారం సాయంత్రం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఇంటిలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతుడు

Published : 12 Aug 2022 05:04 IST

సాయితేజ నాయక్‌

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఎచ్చెర్ల సాయుధ పోలీసు దళంలోని పాడుబడిన క్వార్టర్స్‌లో గురువారం సాయంత్రం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఇంటిలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతుడు సాయతేజ నాయక్‌(24)గా గుర్తించారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న విజయభాస్కర్‌ నాయక్‌ కుమారుడు సాయితేజ నాయక్‌గా ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పాడుపడిన ఇంటిలోనే కొన్నాళ్ల క్రితం వీరు నివాసం ఉండేవారు. బాగా శిథిలం కావడంతో శ్రీకాకుళం పట్టణంలోని రెల్లివీధిలో అద్దెకు వెళ్లిపోయారు. జులై 4న ఉదయం 11 గంటలకు కోర్టు విధుల్లో ఉన్న తండ్రిని కలిసిన సాయితేజ తల్లికి మందులు కొనాలని తండ్రి స్కూటీ తీసుకెళ్లి తిరిగి రాలేదు. దీంతో అప్పట్లో శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. సాయితేజ బొబ్బిలి వెటర్నరీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఘటన స్థలానికి క్లూస్‌టీం చేరుకుని వివరాలు సేకరించింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని