logo

తెలంగాణలోనూ మెరుపులు

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో 4, 5వ ర్యాంకుతో పాటు 100లోపు ర్యాంకులతో పలువురు అదరగొట్టారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు.  వీరు ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్‌, ఈఏపీసెట్‌లో అత్యుత్తమ

Published : 13 Aug 2022 03:32 IST

ఎంసెట్‌లో జిల్లా విద్యార్థుల సత్తా

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో 4, 5వ ర్యాంకుతో పాటు 100లోపు ర్యాంకులతో పలువురు అదరగొట్టారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు.  వీరు ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్‌, ఈఏపీసెట్‌లో అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటారు. మూరుమూల ప్రాంతాల్లో పుట్టిపెరిగి, విద్యనభ్యసించి సిక్కోలు కీర్తిని మరోసారి నలుదిశలా వినిపించారు. ఐఐటీలో సీటు సంపాదించి, భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

- న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం), సంతబొమ్మాళి


ఇష్టపడి చదివా...

పల్లి జలజాక్షి కాకరాపల్లి

రోజుకు 16 నుంచి 18 గంటల పాటు ఇష్టపడి చదివా. అధ్యాపకుల ప్రోత్సాహానికి తోడు, పాఠ్యపుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని. తల్లిదండ్రులు ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించా. కళాశాలలో అధ్యాపకుల శిక్షణ ఎంతోఉపయోగపడింది. ప్రణాళికతో చదివితే విజయం సొంతం చేసుకోవచ్చు. మంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేయడమే నా లక్ష్యం.

- జలజాక్షి, నాలుగో ర్యాంకర్‌, తెలంగాణ ఎంసెట్‌


ఐఐటీ సీటే లక్ష్యం

మెండ హిమవంశీ శ్రీకాకుళం

తెలంగాణ ఎంసెట్‌లోనూ మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైంది.   భవిష్యత్తులో ఐఐటీలో సీటు సాధించి, సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాలనేదే నా లక్ష్యం.

 హిమవంశీ, ఐదో ర్యాంకర్‌


 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని