logo

డబ్బుల కోసమే కిడ్నాప్‌..!

జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన వైద్యుడు గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్‌ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న పరమేశ్‌ తెలిపిన వివరాల ఆధారంగా మరో ఇద్దరు అనుమానితులను శ్రీకాకుళం నగరంలోనే పట్టుకున్నట్లు సమాచారం. వారిని ప్రస్తుతం పోలీసుస్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్లు తెలిసింది.

Published : 13 Aug 2022 03:32 IST

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన వైద్యుడు గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్‌ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న పరమేశ్‌ తెలిపిన వివరాల ఆధారంగా మరో ఇద్దరు అనుమానితులను శ్రీకాకుళం నగరంలోనే పట్టుకున్నట్లు సమాచారం. వారిని ప్రస్తుతం పోలీసుస్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్లు తెలిసింది. నగరానికి చెందిన ఇద్దరు, విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ముగ్గురు తెలిపిన వివరాలతో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. కిడ్నాప్‌లో పాల్గొన్న మరో వ్యక్తి రాజు కోసం విశాఖలో తీవ్రంగా గాలిస్తున్నారు.

రాజు దొరికితేనే...

ఆ నలుగురు డబ్బుల కోసమే వైద్యుడు సోమేశ్వరరావును కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుడి గురించి పూర్తి సమాచారం తెలిసిన, ఆయన ఇంటి సమీపంలోనే పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రధాన సూత్రధారికి అన్ని వివరాలు తెలిపినట్లు విచారణలో బయటపడినట్లు తెలిసింది. ప్రధాన సూత్రధారి గతంలోనూ వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలామంది వద్ద రూ.లక్షల్లో గుంజేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈయన వినియోగిస్తున్న కారుకు సంబంధించిన పత్రాలూ కూడా సక్రమంగా లేవు.  అయితే విశాఖపట్నానికి చెందిన రాజు ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కేసు కొలిక్కి రావట్లేదు. ఇతను  దొరికితే కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని