logo

మదిలో మోగిన హంసధ్వనులు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శ్రీకాకుళం గ్రామీణ మండలం కళ్లేపల్లిలోని సంప్రదాయం నాట్యగురుకులంలో మూడు రోజుల పాటు ‘హంసధ్వని’ పేరిట నిర్వహించనున్న ధ్యాన, సంగీత నృత్య ప్రదర్శనలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. దీనికి మంత్రి ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ

Published : 13 Aug 2022 03:32 IST

 ప్రదర్శనలను తిలకిస్తున్న మంత్రి ధర్మాన, కలెక్టరు లఠ్కర్‌, ప్రజలు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శ్రీకాకుళం గ్రామీణ మండలం కళ్లేపల్లిలోని సంప్రదాయం నాట్యగురుకులంలో మూడు రోజుల పాటు ‘హంసధ్వని’ పేరిట నిర్వహించనున్న ధ్యాన, సంగీత నృత్య ప్రదర్శనలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. దీనికి మంత్రి ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తొలిరోజు అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు, కూచిపూడి నృత్యాలతో కళాకారులు అలరించారు. చివరిగా సినీ గాయకులు నీహాల్‌, హరికృష్ణ, శ్రావణి పాటలతో ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో సంప్రదాయం సంచాలకులు స్వాతి సోమనాథ్‌, పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు.   

  - న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం
   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని