logo

వేడుకలకు సర్వం సిద్ధం!

స్వాతంత్య్ర వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి చినుకులు పడుతుండటంతో ఏర్పాట్లలో జాప్యం జరిగింది. సాయంత్రానికి

Published : 15 Aug 2022 06:29 IST

శ్రీకాకుళం నగరంలో...

ఏకాత్మ.. తివర్ణ

మతాలు.. జాతులు.. వర్ణాలు

అన్నీ ఈ నేలలో ఇంకిపోయి

ఏకాత్మను సంతరించుకున్నాయి

అదే భారతీయత

అన్న రవీంద్రుని

మాటలు స్మరించుకుంటూ ఈ వజ్రోత్సవాన సగర్వంగా జెండాకు వందనం చేద్దాం రండి

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి చినుకులు పడుతుండటంతో ఏర్పాట్లలో జాప్యం జరిగింది. సాయంత్రానికి మిగిలిన పనులు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తొలుత పోలీసుశాఖ ఆధ్వర్యంలో సాయుధ దళాలతో గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను మంత్రి మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను ఆర్డీవో శాంతి, తహసీల్దార్లు ఎన్‌.వెంకటరావు, సుధాసాగర్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సూచించే వివిధ శాఖల శకటాల ప్రదర్శన, స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షురాలు, కలెక్టర్‌, జేసీ, ఇతర జిల్లా అధికారులు తదితరులు హాజరుకానున్నారు.

263 మందికి ప్రశంసాపత్రాలు...

జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉత్తమ సేవలందించిన పలువురి ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు. మొత్తం 82 ప్రభుత్వ శాఖలకు గాను 256 మంది ఉద్యోగులు, 5 స్వచ్ఛంద సంస్థల నుంచి ఏడుగురికి మొత్తంగా 263 మందికి ప్రశంసాపత్రాలు ఇచ్చేందుకు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఎంపిక చేశారు. నలుగురు జిల్లా అధికారులకు ప్రశంసా పత్రాలు ఇవ్వనున్నారు. వారిలో సర్వే ల్యాండ్‌ రికార్డ్సు ఏడీ కె.ప్రభాకర్‌, సెట్‌శ్రీ సీీఈవో ప్రసాదరావు, సమగ్రశిక్ష ఏపీసీ డా.ఆర్‌.జయప్రకాష్‌, సీపీవో వి.ఎస్‌.ఎస్‌.ఎల్‌ ప్రసన్న ఉన్నారు.

కాశీబుగ్గలో 300 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని