logo

అడ్డంగా గోడ.. నడిచేది ఎలా..?

మున్సిపాలిటీ పరిధిలోని మెట్టక్కివలస 9వ వార్డు మానుకొండవారివీధిలో శనివారం సిమెంటు రహదారికి అడ్డంగా గోడను కట్టడంతో వివాదం నెలకొంది. గోడ అడ్డం కావడంతో రాకపోకలు నిలిచాయి. ఈ విషయమై స్థానికులు కొందరు వార్డు

Published : 15 Aug 2022 06:29 IST

పోలీసులకు ఫిర్యాదు

రహదారికి అడ్డంగా కట్టిన గోడ ఇదే..

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: మున్సిపాలిటీ పరిధిలోని మెట్టక్కివలస 9వ వార్డు మానుకొండవారివీధిలో శనివారం సిమెంటు రహదారికి అడ్డంగా గోడను కట్టడంతో వివాదం నెలకొంది. గోడ అడ్డం కావడంతో రాకపోకలు నిలిచాయి. ఈ విషయమై స్థానికులు కొందరు వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయడంతో ప్లానింగ్‌ కార్యదర్శి సంఘటనా స్థలానికి చేరుకొని నిర్మాణాలను నిలుపుచేయాలని చెప్పగా అలా చెప్పడానికి నీవు ఎవరివని, నీకేం అధికారం ఉందని అతనితో వాగ్వాదానికి దిగడంతో ఆయన వెనుతిరిగి వెళ్లి మున్సిపల్‌ కమిషనర్‌కు ఈ విషయాన్ని తెలియపరిచారు. ఈ విషయమై స్థానికులు మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం పరిశీలిస్తామని చెబుతున్నారే తప్ప, సమస్య పరిష్కారానికి మాత్రం చర్యలు చేపట్టడం లేదని వారు వాపోతున్నారు. గోడ నిర్మిస్తున్న వ్యక్తి పోలీసు శాఖలో పనిచేస్తుండటంతో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని వారు చెబుతున్నారు. ఈ విషయమై కమిషనర్‌ను వివరణ కోరగా అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించి, తగిన చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని