logo

నదీ తీరంలో నిర్మాణమా..?

ఇక్కడ ఆర్‌బీకే భవన నిర్మాణానికి ఎవరు అనుమతులిచ్చారంటూ కలెక్టర్‌ లఠ్కర్‌ పంచాయతీరాజ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమదాలవలస మండలం కలివరంలో నాగావళి నది ఒడ్డున నిర్మించిన రైతు భరోసా కేంద్రం వరద ఉద్ధృతితో కోతకు గురైంది.

Published : 17 Aug 2022 06:38 IST

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఇక్కడ ఆర్‌బీకే భవన నిర్మాణానికి ఎవరు అనుమతులిచ్చారంటూ కలెక్టర్‌ లఠ్కర్‌ పంచాయతీరాజ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమదాలవలస మండలం కలివరంలో నాగావళి నది ఒడ్డున నిర్మించిన రైతు భరోసా కేంద్రం వరద ఉద్ధృతితో కోతకు గురైంది. దీంతో ఆ ప్రాంతాన్ని మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. నిధుల మంజూరు, బిల్లుల చెల్లింపులపై అధికారులను ప్రశ్నించారు. దీనికి పంచాయతీరాజ్‌ అధికారులు స్పందిస్తూ రూ.21.80 లక్షలు మంజూరు కాగా రూ.18 లక్షల వరకూ బిల్లులు చెల్లించామన్నారు. అసలు ఈ నిర్మాణానికి నీటిపారుదలశాఖ అధికారుల అనుమతులు పొందారా అని ప్రశ్నించగా తీసుకున్నట్లు  పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి అరుణకుమారి స్పష్టం చేశారు. అయితే ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని నీటిపారుదలశాఖ అధికారి సుధాకర్‌ చెప్పడంతో కలెక్టర్‌ వారిపై ఆసహనం వ్యక్తం చేశారు. నది ఒడ్డున కట్టడం దారుణమని, అవగాహన లేమి కారణంగా  ప్రజాధనం వృథా అవుతుందన్నారు. దీనికి రక్షణ కల్పించాలంటే అదనంగా మరో రూ.24 లక్షలు ఖర్చవుతుందని అధికారులు వివరించడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్మాణం పనికిరాదని తెలిపితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరోచోట ఆర్బీకే నిర్మాణానికి చర్యలు చేపడతామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని