logo
Published : 17 Aug 2022 06:38 IST

వేధింపుల తాళలేక వివాహిత ఆత్మహత్య

మాధవి (పాత చిత్రం)

పాతపట్నం, న్యూస్‌టుడే: అత్తింటి వేధింపులను భరించలేక పాతపట్నం మండలం తామర గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌.ఐ. ఎన్‌.కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. హిరమండలం మండలం ఆకులతంపర గ్రామానికి చెందిన మాధవి(23)కి పాతపట్నం మండలం తామర గ్రామానికి చెందిన సొంత మేనమామ కుమారుడు కూర్మాపు ఆశిష్‌కుమార్‌తో 2019లో వివాహం చేశారు. ఆశిష్‌ ఆర్మీ ఉద్యోగి కావడంతో జమ్ముకాశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే కుమారుడు ఆమెను పెళ్లి చేసుకోవడం అత్త వరలక్ష్మికి ఇష్టం లేకపోవడంతో వేధిస్తూ ఉండేది. ఇటీవల మామ ఆదినారాయణ మృతి చెందగా సోమవారం దినకార్యం నిర్వహించారు. ఆ సమయంలో అత్త పెళ్లి తరువాత వ్యాపారంలో నష్టం జరిగిందని, అలాగే కుటుంబ పెద్దను కోల్పోయామని మాధవిని నిందించడంతో మనస్తాపానికి గురైంది. సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకుని సీఐ ఎం.వినోద్‌బాబు, సిబ్బంది ఘటనా స్థలానికి వెళి పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మాధవి తల్లి ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. తెలిపారు.
 

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని