logo

లోకాన్ని వదిలి... శోకాన్ని మిగిల్చి..!

వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనల్లో అయిదుగురు జిల్లావాసులు  ప్రాణాలు కోల్పోయారు. అయిన వారందరినీ వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు.

Updated : 17 Aug 2022 06:49 IST

వేర్వేరు ఘటనల్లో అయిదుగురు జిల్లావాసులు మృతి

వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనల్లో అయిదుగురు జిల్లావాసులు  ప్రాణాలు కోల్పోయారు. అయిన వారందరినీ వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. బలవన్మరణానికి పాల్పడి ఇద్దరు, రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు, పాముకాటుకు గురై ఒకరు, ఛాతీలో నొప్పితో ఓ యువకుడు మృతి చెందారు. ఆయా కుటుంబాల్లో తీరన్ని శోకాన్ని మిగిల్చారు. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.
పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా...
లట్టిగాం(నందిగాం), న్యూస్‌టుడే: నందిగాం మండలంలోని కాపుతెంబూరు పంచాయతీ లట్టిగాం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మృతి చెందారు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హనుమంతు కృష్ణమూర్తి(70) పొలంపనులు చూసుకొని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు. ఇంతలో టెక్కలి నుంచి పలాసవైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వడ్డి రామోజీరావు ఈయన బలంగా ఢీకొట్టారు. ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపంచనామాకు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఏస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌అలీ చెప్పారు. కృష్ణమూర్తి భార్య మృతి చెందారు. కుమార్తెకు వివాహం కావడం, కుమారులు ఇద్దరు ఉద్యోగరీత్యా వేర్వేరు చోట్ల ఉన్నారు. ప్రస్తుతం కృష్ణమూర్తి ఒక్కరే ఉంటున్నారు.

ప్రాణం తీసిన అప్పుల భారం
సారవకోట, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక ఓ ఇంటిపెద్ద ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సారవకోట మండలంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ బి.లావణ్య, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చీడిపూడి కాలనీకి చెందిన సుగుంద శ్రీనివాసరావు(40) కర్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తెకు మూడునెలల కిందట శ్రీనివాసరావు వివాహం చేశారు. పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈయన మృతితో కుటుంబమంతా వీధినపడిందని స్థానికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని