logo

కృషికి పట్టుదల తోడైతే విజయం తథ్యం

కృషికి పట్టుదల తోడైతే విజయం అదే వస్తుందని క్రీడాకారుల అదే స్ఫూర్తితో సాగాలని మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు.

Published : 27 Sep 2022 06:27 IST

క్రీడా జ్యోతిని వెలిగిస్తున్న మంత్రి అప్పలరాజు, జడ్పీ అధ్యక్షురాలు విజయ, ఎమ్మెల్యే కృష్ణదాస్‌, పురపాలక అధ్యక్షురాలు రాజలక్ష్మి, తదితరులు

ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: కృషికి పట్టుదల తోడైతే విజయం అదే వస్తుందని క్రీడాకారుల అదే స్ఫూర్తితో సాగాలని మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. ఇచ్ఛాపురం రాజావారి మైదానంలో 32వ అంతర్‌ జిల్లా బాలబాలికల సబ్‌జూనియర్స్‌ ఖోఖో పోటీలను సోమవారం సాయంత్రం వారు ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించి, క్రీడాకారులకు అందించారు. పోటీల ప్రారంభం సందర్భంగా శ్రీస్వేచ్ఛా నృత్య అకాడమి సంస్థ నాట్యగురువు మంగి దివ్య, అధ్యక్షులు కె.గోవిందరావు ఆధ్వర్యంలో కళాకారులు చేసిన శాస్త్రీయ నృత్యప్రదర్శన, నృత్యశిక్షకులు ఆర్‌.మోహన్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులు చేసిన కోలాటం అలరించాయి. పురాధ్యక్షురాలు పిలక రాజలక్ష్మి అధ్యక్షత వహించగా, పిరియా సాయిరాజ్‌, నర్తు రామారావు, బోర పుష్ప, ఉలాల భారతిదివ్య, తాడి ఆదిరెడ్డి, లోకేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని