logo

బండి నడపడమే పెద్ద పరీక్ష..

జిల్లాలో వాహనాల డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీకి అవసరమైన డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మాణం అటకెక్కింది. శ్రీకాకుళం నగరానికి సమీపంలోని తండ్యాంవలస రహదారిలో ఉన్న రవాణాశాఖ కార్యాలయ ఆవరణలోని మూడు సెంట్ల స్థలంలోనే అధికారులు

Published : 27 Sep 2022 06:27 IST

ఎచ్చెర్లలో డ్రైవింగ్‌ ట్రాక్‌ కోసం కేటాయించిన స్థలం ఇదే..

న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం): జిల్లాలో వాహనాల డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీకి అవసరమైన డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మాణం అటకెక్కింది. శ్రీకాకుళం నగరానికి సమీపంలోని తండ్యాంవలస రహదారిలో ఉన్న రవాణాశాఖ కార్యాలయ ఆవరణలోని మూడు సెంట్ల స్థలంలోనే అధికారులు అతికష్టంగా డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రవాణాశాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 2018లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి పదెకరాల స్థలం కేటాయించింది. కానీ ఆ తరువాత అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో నేటికీ డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం ఆ స్థలాన్ని చదును చేసి లెర్నింగ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు.
జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వారి పరిధిలో ప్రతిరోజు ఎల్‌ఎల్‌ఆర్‌లు సుమారు 150 వరకు జరుగుతుంటాయి. శాశ్వత లైసెన్సులకు సంబంధించి రోజుకు 120 నుంచి 150 వరకు పరీక్షలు నిర్వహిస్తుంటారు. సరైన ట్రాక్‌ లేక ప్రస్తుతానికి తండ్యాంవలసలో, ఎచ్చెర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. లారీలు వంటి భారీ వాహనాలను విజయనగరం పంపిస్తున్నారు. ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రాక్‌ను నిర్మిస్తే ఆ ఇబ్బందులు తీరుతాయి. ఆ మేరకు ట్రాక్‌లు నిర్మించడంతో పాటు ఎక్కడికక్కడ అధునాతన సెన్సార్లు అమర్చేందుకు అధికారులు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఏళ్లు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నారు.

వర్షం పడితే బురదమయం...

స్థలం కేటాయించిన తరువాత ఎన్నిసార్లు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు జాతీయ రహదారి పనులు చేపడుతున్న వారితో మాట్లాడి ఉన్న స్థలాన్ని చదును చేయించారు. అక్కడ ఎల్‌ఎల్‌ఆర్‌లు కేటాయిస్తున్నారు. కాకపోతే ఎర్రనేల కావడంతో వర్షం పడితే ఆ ప్రాంతమంతా బురదమయంగా మారుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం... - శ్రీదేవి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌

డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మాణం విషయమై ఉన్నతాధికారులకు నివేదించాం. ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేశాం. అయితే ప్రభుత్వం నుంచి ట్రాక్‌ నిర్మాణానికి నిధులు విడుదల కావాల్సి ఉంది. రూ.5 కోట్లు కేటాయిస్తే యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే ఎల్‌ఎల్‌ఆర్‌తో పాటు డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని