logo

ప్రభుత్వ విధానాలపై సీపీఎం పోరుబాట

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం నాయకులు పోరుబాట పట్టారు. ‘దేశరక్షణ భేరి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలి నుంచి న్యూకాలనీ

Published : 27 Sep 2022 06:27 IST

ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎంపీ మధు, సీపీఎం జిల్లా నాయకులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం నాయకులు పోరుబాట పట్టారు. ‘దేశరక్షణ భేరి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలి నుంచి న్యూకాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. దాన్ని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ పి.మధు ప్రారంభించారు. అనంతరం న్యూకాలనీలోని డైమండ్‌ పార్కు వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వదిలి పెట్టారన్నారు. పోలీసుల జీతాల్లో కోత విధించారని, ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టారన్నారు. నూతన విద్యావిధానం పేరుతో విద్వేషాలు రగుల్చుతున్నారన్నారు. అధికార పార్టీకి పోలీసులు పూర్తిగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వీటిపై ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.  కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, జి.సింహాచలం, ఎన్‌.షణ్ముఖరావు, టి.తిరుపతిరావు, ప్రసాదరావు, అమ్మన్నాయుడు, ఎన్‌.వి.రమణ, మహాలక్ష్మి, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని