logo

Thief: 200కు పైగా ఇళ్లలో చోరీలు చేసిన దొంగ మళ్లీ వచ్చాడు!

ఆ ప్రబుద్ధుడు సుమారు 200కుపైగా ఇళ్లలో దొంగతనాలు చేశాడు. చోరీలకు పాల్పడటం, పోలీసులకు చిక్కడం, జైలుకు వెళ్లి శిక్ష అనుభవించడం, మళ్లీ ఇంటికి రావడం ఆయనకు అలవాటు. ఆ ఘనుడు మళ్లీ జిల్లాలోకి వచ్చినట్లు తెలియడంతో

Updated : 28 Sep 2022 08:15 IST

సీసీ టీవీ ఫుటేజీలో లభ్యమైన నిందితుడి చిత్రం

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: ఆ ప్రబుద్ధుడు సుమారు 200కుపైగా ఇళ్లలో దొంగతనాలు చేశాడు. చోరీలకు పాల్పడటం, పోలీసులకు చిక్కడం, జైలుకు వెళ్లి శిక్ష అనుభవించడం, మళ్లీ ఇంటికి రావడం ఆయనకు అలవాటు. ఆ ఘనుడు మళ్లీ జిల్లాలోకి వచ్చినట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన దున్నకృష్ణ అలియాస్‌ రాజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. కొన్ని నెలల కిందట శ్రీకాకుళం నగరంలోనూ 5 ఇళ్లల్లో చోరీలు చేశాడు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, ఏలూరుల్లోనూ పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.

మూడు రోజుల కిందట శ్రీకాకుళం నగరం విశాఖ ఏ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ కేసు విచారణలో భాగంగా కొన్ని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా దున్నకృష్ణ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కృష్ణ ఫొటోలతో కూడిన కరపత్రాలను వివిధ వాట్సాప్‌ గ్రూప్‌ల్లో పెట్టారు. అప్రమత్తంగా ఉండాలని, ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని కోరారు. ఈ విషయమై డీఎస్పీ ఎం.మహేంద్ర మాట్లాడుతూ ‘నగరంలో దొంగతనాలు జరుగుతున్నందున గస్తీ పెంచాం. రాత్రిపూట అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నాం. దున్నకృష్ణను త్వరలోనే పట్టుకుంటాం. ఇళ్లకు తాళాలు వేసి దూరప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ విధానాన్ని వినియోగించుకోవాలి.’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని