logo

రైతే అసలైన శాస్త్రవేత్త

అసలు సిసలైన శాస్త్రవేత్త రైతేనని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాలతో పాటు ఉద్యానవన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బూర్జ మండలం పెద్దపేట వద్ద ఉద్యానవన పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన, ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను గురువారం ఆయన ప్రారంభించారు.

Published : 30 Sep 2022 06:32 IST

వ్యవసాయశాఖ మంత్రి కె.గోవర్ధన్‌రెడ్డి

బూర్జ: శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి గోవర్ధన్‌రెడ్డి, పక్కన సభాపతి తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే కృష్ణదాస్‌ తదితరులు

బూర్జ, ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: అసలు సిసలైన శాస్త్రవేత్త రైతేనని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాలతో పాటు ఉద్యానవన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బూర్జ మండలం పెద్దపేట వద్ద ఉద్యానవన పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన, ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా పాలనలో రాష్ట్రం పూర్తిగా అప్పులపాలైందని ఆరోపించారు. పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌, ఉద్యానశాఖ అధికారులు, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎ.సూరిబాబు, డీసీసీబీ అధ్యక్షుడు కె.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని