logo

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు: మంత్రి

పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను గురువారం ఆయన ప్రారంభించారు.

Published : 30 Sep 2022 06:32 IST

తొగరాంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభిస్తున్న మంత్రి గోవర్ధన్‌రెడ్డి, స్పీకర్‌ సీతారాం, తదితరులు

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా పాలనలో ప్రజల డబ్బు దోచుకున్నారని, ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి డబ్బులను ప్రజలకు పంచి పెడుతున్నారన్నారు. రాజధాని వికేంద్రీకరణను అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొట్టి అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేయిస్తున్నారన్నారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే తెదేపా నాయకులు కేసులు వేసి ప్రగతికి అడ్డుపడుతున్నారన్నారు. అభివృద్ధి చేయడం లేదంటున్న చంద్రబాబునాయుడితో చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. బూర్జలో ఉద్యానవన పాలిటెక్నిక్‌ కళాశాలను కూడా మంత్రి మంజూరు చేస్తున్నట్లు తెలిపారన్నారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ, సర్పంచి తమ్మినేని వాణిశ్రీ, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, పార్టీ మండల అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామ్మూర్తి, వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీలత, శాస్త్రవేత్తలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని