logo

లాభాల బాటలో సహకార బ్యాంకులు

 వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు పని చేస్తున్నాయని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పాలకవర్గ సభ్యులు, బ్యాంకు అధికారులతో సమీక్షించారు.

Published : 30 Sep 2022 06:32 IST

మాట్లాడుతున్న మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు పని చేస్తున్నాయని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పాలకవర్గ సభ్యులు, బ్యాంకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లు లాభాలబాటలో నడుస్తున్నాయన్నారు. వీటి ద్వారా అతి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. స్థానికంగా లభించే పంటల ఆధారంగా జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, డీపీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ సుగుణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌, డీసీసీబీ సీఈవో డి.వరప్రసాద్‌, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ శిమ్మ నేతాజీ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని