logo

బడుగులపై పిడుగుపాటు

వేర్వేరు ప్రాంతాల్లో పొలాల్లో పనిచేసుకుంటున్న వారిపై పిడుగులు పడటంతో ఇద్దరు మృతిచెందారు. నరసన్నపేట మండలం మాకివలసకు చెందిన రావాడ హరి(34) ఆదివారం పొలంలో ఎరువు వేసేందుకు వెళ్లాడు. ఎరువు చల్లుతుండగా, మేఘాలు కమ్ముకొన్నాయి. భారీ వర్షంతోపాటు హరిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Published : 03 Oct 2022 02:50 IST

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి మృతి

నరసన్నపేట, పొందూరు, న్యూస్‌టుడే: వేర్వేరు ప్రాంతాల్లో పొలాల్లో పనిచేసుకుంటున్న వారిపై పిడుగులు పడటంతో ఇద్దరు మృతిచెందారు. నరసన్నపేట మండలం మాకివలసకు చెందిన రావాడ హరి(34) ఆదివారం పొలంలో ఎరువు వేసేందుకు వెళ్లాడు. ఎరువు చల్లుతుండగా, మేఘాలు కమ్ముకొన్నాయి. భారీ వర్షంతోపాటు హరిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో  కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా, హరి మృతదేహం కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఆయనకు భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో పొందూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన మొదలవలస వరలక్ష్మి(46) మధ్యాహ్నం పూట మొక్కజొన్న తోటలో పనిచేస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఎటూ వెళ్లలేక అక్కడే ఉండిపోయింది. అదే సమయంలో ఆమెకు సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. వరలక్ష్మికి భర్త, ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఆమె మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్‌.ఐ. లక్ష్మణరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని