logo

పరీక్ష రాసేద్దాం.. ప్రతిభ చూపిద్దాం..!

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశించిన కౌశల్‌ ప్రతిభాన్వేషణకు పోటీలకు ప్రకటన వెలువడింది. రాష్ట్ర సాంకేతిక సలహా మండలి(ఆప్కాస్ట్‌), భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా పోటీలను నిర్వహించనున్నాయి. ప్రభుత్వ యాజమాన్యాల్లో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు.

Published : 03 Oct 2022 02:50 IST

‘కౌశల్‌’ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

గోడపత్రికను విడుదల చేస్తున్న డీఈవో జి.పగడాలమ్మ, తదితరులు

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశించిన కౌశల్‌ ప్రతిభాన్వేషణకు పోటీలకు ప్రకటన వెలువడింది. రాష్ట్ర సాంకేతిక సలహా మండలి(ఆప్కాస్ట్‌), భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా పోటీలను నిర్వహించనున్నాయి. ప్రభుత్వ యాజమాన్యాల్లో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందించడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. క్విజ్‌, పోస్టర్‌ ప్రెజెంటేషన్‌ రెండు విభాగాల్లో పోటీలు ఉంటాయి.

క్విజ్‌ పోటీలకు సంబంధించి 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో మొదట పరీక్ష పెడతారు. అందులో ఉత్తమ మార్కులు వచ్చిన బృందాన్ని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. ఒక్కో తరగతి నుంచి ఒక్కో విద్యార్థి కచ్చితంగా ఉండాలి. గణితం, సైన్సుతో పాటుగా విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి అనే అంశంపై క్విజ్‌ పోటీలు జరుగుతాయి. విజేతలకు జిల్లా, రాష్ట్రస్థాయిలో నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందిస్తారు. జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతికి రూ.7,500, ద్వితీయ బహుమతికి రూ.6,000, తృతీయ స్థానంలో నిలిస్తే రూ.4,500 రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు రూ.15,000, రూ.12,000, రూ.9,000, రాష్ట్రస్థాయిలో ప్రోత్సాహక బహుమతిగా రూ.6,000 ఇస్తారు.

పోస్టర్‌ ప్రెజెంటేషన్‌ పోటీలకు ఇలా...: వీటికి 8, 9 తరగతుల విద్యార్థులు మాత్రమే అర్హులు. ఒక పాఠశాల నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. జీవవైవిధ్య సంరక్షణ, జల సంరక్షణ, వాతావరణంలో మార్పులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో విజేతలకు జిల్లా స్థాయిలో మొదటి స్థానాలకు వరుసగా రూ.3,000, రూ.2,000, రూ.1,000, రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు రూ.7,500, రూ.5,000, రూ.3,000, రాష్ట్రస్థాయిలో ప్రోత్సాహక బహుమతిగా రూ.1,000లు ఇస్తారు. గెలుపొందినవారికి గవర్నర్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేస్తారు.

ముఖ్యమైన తేదీలివీ... పాఠశాల సమన్వయకర్తలు అక్టోబరు 15వ తేదీలోగా విద్యార్థుల పేర్లను ‌www.bvmap.org  ద్వారా నమోదు చేయాలి. క్విజ్‌కుగాను ముగ్గురు,  పోస్టర్‌ ప్రజంటేషన్‌కు ఇద్దరు చొప్పున ఎంపిక చేయాలి.  ః పాఠశాలస్థాయిలో నవంబరు 2, 3 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. ః జిల్లాస్థాయిలో నవంబరు 26న, రాష్ట్రస్థాయిలో డిసెంబరు 9న ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లోనే... విద్యార్థుల సామర్థాన్ని పరీక్షించేందుకు కౌశల్‌ పోటీలు మంచి వేదిక. 2022 సంవత్సరానికి సంబంధించి ప్రకటన వచ్చింది. అక్టోబరు 15వ తేదీలోగా వెబ్‌సైట్‌లో విద్యార్థుల వివరాలను నమోదు చేసుకోవాలి. పరీక్ష ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. సైన్సు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు దోహదపడే ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు పోత్సహించాలి.  

- ఎస్‌.వి.మధుబాబు, జిల్లా సమన్వయకర్త, కౌశల్‌ ప్రతిభాన్వేషణ పరీక్ష

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని