logo

మరో 4 రోజులు వానలు..

బంగాళాఖాతంలో అల్పపీడనం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సంయుక్త కలెక్టరు ఎం.విజయసునీత ప్రకటించారు.

Updated : 05 Oct 2022 05:07 IST

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
అధికార యంత్రాంగం అప్రమత్తం

కలెక్టరేట్‌, అర్బన్‌, (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో అల్పపీడనం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సంయుక్త కలెక్టరు ఎం.విజయసునీత ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. మంగళవారం అధికారులతో దూరదృశ్య  సమావేశం నిర్వహించి మాట్లాడారు. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజులు ఉంటుందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. వంశధార, నాగావళి నదుల్లోని నీటి ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. పండగల సందర్భంగా యువత, మహిళలు సముద్ర స్నానాలకు వెళ్లొద్దని తీర ప్రాంతాల్లో దండోరా వేయించాలన్నారు. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

హిరమండలంలో అధిక వర్షపాతం
అల్పపీడనం కారణంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. హిరమండలంలో (రాత్రి 8 గంటల వరకు) అత్యధికంగా 17.75 మి.మీ., జలుమూరు మండలంలో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని