logo

మావోల లేఖపై పోలీసుల ఆరా..!

మావోయిస్టులు విడుదల చేసిన  లేఖ ఇదే..శ్రీకాకుళం నేరవార్తా విభాగం, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: జిల్లాలో గత 20 ఏళ్లుగా స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ ఒక్కసారిగా తెరపైకి వచ్చారు.

Updated : 05 Oct 2022 05:49 IST

మావోయిస్టులు విడుదల చేసిన  లేఖ ఇదే..

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: జిల్లాలో గత 20 ఏళ్లుగా స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. కదలికలు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో కొందరు వైకాపా నేతలు భూములు ఆక్రమించుకుంటున్నారని, ప్రజలు తిరగబడి వ్యతిరేకంగా పోరాడాలంటూ ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కార్యదర్శి గణేష్‌ పేరున ఓ లేఖను విడుదల చేయడం జిల్లాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అసలు ఈ లేఖ నిజమైందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పంపారా? అనే కోణంలో జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా విచారణ ప్రారంభించారు. కాశీబుగ్గ పట్టణంలో పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts