logo

ఈ-క్రాప్‌ శతశాతం పూర్తి చేయాలి: జేసీ

ఈ-క్రాప్‌ నమోదు శతశాతం పూర్తి కావాలని జేసీ ఎం.విజయసునీత ఆదేశించారు. మండలస్థాయి అధికారులు, వ్యవసాయాధికారులతో మంగళవారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు.

Published : 05 Oct 2022 05:31 IST


మాట్లాడుతున్న జేసీ విజయసునీత, చిత్రంలో ఇతర అధికారులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఈ-క్రాప్‌ నమోదు శతశాతం పూర్తి కావాలని జేసీ ఎం.విజయసునీత ఆదేశించారు. మండలస్థాయి అధికారులు, వ్యవసాయాధికారులతో మంగళవారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అధికారులు రైతుల వద్దకు వెళ్లి తక్షణమే ఈ-క్రాప్‌ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వం జిల్లాకు నిర్ణయించిన రీసర్వేను పూర్తి చేయాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీవోలు పర్యవేక్షించి నివేదికలు అందజేయాలన్నారు. తహసీల్దార్లు ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించి రైతుల ఫొటోలు, వివరాలు తప్పులు లేకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఎం.రాజేశ్వరి, ఆర్డీవో శాంతి, వ్యవసాయాధికారి కె.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని