logo

బ్రహ్మోత్సవాలకు బస్సుయాత్ర

తితిదే శ్రీవాణి ట్రస్టు ఆర్థిక సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తుల తిరుమల దివ్యదర్శనానికి బయలుదేరారు.

Published : 05 Oct 2022 05:31 IST


శ్రీకాకుళంలో జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తున్న నిర్వాహకులు

శ్రీకాకుళం సాంస్కృతికం, గార, న్యూస్‌టుడే: తితిదే శ్రీవాణి ట్రస్టు ఆర్థిక సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తుల తిరుమల దివ్యదర్శనానికి బయలుదేరారు. బూర్జ, పోలాకి, మందస, సోంపేట, గార మండలాల్లోని వివిధ పంచాయతీల్లో నూతనంగా నిర్మించిన దేవాలయాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రజలను బ్రహ్మోత్సవాల దర్శనానికి తీసుకువెళ్లారు. 8 బస్సుల్లో సుమారు 400 మంది వెళ్లినట్లు నిర్వాహకులు ప్రకటించారు. బూర్జ మండలం ఉప్పినివలస నుంచి బయలుదేరిన రెండు బస్సులకు సర్పంచి రమాదేవి, ప్రతినిధి వెంకటరమణ, గ్రామపెద్దలు, మహిళలు జెండాఊపి ప్రారంభించారని తితిదే ధర్మప్రచార పరిషత్‌ కార్యక్రమాల నిర్వాహకురాలు ఎం.లలితమణి తెలిపారు. శ్రీకాకుళం కొత్తరోడ్డు వద్ద కన్వీనర్‌ రుప్ప వెంకటరమణ, సింహాద్రి ఫల్గుణరావు ప్రారంభించారు. ఎస్‌.ఎస్‌.ఎఫ్‌. జిల్లా ప్రచారక్‌లతో పాటు  వివిధ మండలాల కన్వీనర్లు, కోకన్వీనర్లు, సబ్‌డివిజన్‌ ప్రచారక్‌లు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఈ నెల 6న భక్తులు తిరిగి వస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు