logo

పిడుగుపడి.. రాకపోకలు నిలిచి..

నరసన్నపేట మండలంలోని ఉర్లాం రైలు నిలయంలో సాంకేతిక సమస్య తలెత్తి సిగ్నల్‌ వ్యవస్థ పని చేయకపోవడంతో నడగాం వద్ద రైల్వేగేటు గంటసేపు మూసివేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Published : 05 Oct 2022 05:31 IST

నరసన్నపేట మండలంలోని ఉర్లాం రైలు నిలయంలో సాంకేతిక సమస్య తలెత్తి సిగ్నల్‌ వ్యవస్థ పని చేయకపోవడంతో నడగాం వద్ద రైల్వేగేటు గంటసేపు మూసివేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గేటుకు ఇరువైపులా పలు వాహనాలు గంట పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. కామేశ్వరపేట సమీపంలో స్తంభంపై పిడుగుపడి సిగ్నల్స్‌ వ్యవస్థ పనిచేయకపోవడంతో రైల్వేగేటు మూసివేశామని, ఆ సమయంలో భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ విశాఖ రైలుతో పాటు గూడ్స్‌ రైళ్లను కొంతసేపు నిలిపివేశామని, అరగంట తరువాత సాంకేతిక సమస్య పరిష్కారమైందని ఉర్లాం రైలు నిలయం అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

- న్యూస్‌టుడే, ఉర్లాం(నరసన్నపేటగ్రామీణం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు