logo

జయ జయహే.. మహిషాసురమర్దిని

శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం దేవాలయాల్లో మహర్నవమి పూజలు నిర్వహించారు. అమ్మవార్లను మహిషాసురమర్దినిగా అలంకరించారు.

Published : 05 Oct 2022 05:31 IST


టెక్కలి: పాతబస్టాండు వద్ద దుర్గామాతకు విశేషాలంకరణ

శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం దేవాలయాల్లో మహర్నవమి పూజలు నిర్వహించారు. అమ్మవార్లను మహిషాసురమర్దినిగా అలంకరించారు. అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు, చండీ హోమాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో దీప పూజలు 


శ్రీకాకుళం: మొండేటి వీధిలోని శ్రీలలితాదేవికి సామూహిక పంచహారతులు


ఎచ్చెర్ల సమీపంలో కుశాలపురంలో..

- న్యూస్‌టుడే, బృందం


వెండి చెరకు, పూలతో దర్శనం

గుజరాతీపేటలో రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరిదేవి పీఠంలో అమ్మవారు వెండి చెరకు, పుష్పం ఆభరణాలతో భక్తులకు దర్శనమిచ్చారు.   

- న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)


సారె సమర్పణ..

శ్రీకాకుళం నగరంలోని నానుబాలవీధి విజయదుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం విజయదుర్గాదేవిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారి సారెను మేళతాళాలతో ఊరేగించి సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని