logo

ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌(ఐఎస్‌బీ)లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాకుళం నగరానికి చెందిన పేడాడ కిరణ్‌ సదరు సంస్థ అందించే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు.

Updated : 07 Oct 2022 05:25 IST

పేడాడ కిరణ్‌

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌(ఐఎస్‌బీ)లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాకుళం నగరానికి చెందిన పేడాడ కిరణ్‌ సదరు సంస్థ అందించే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి జరిగిన ఎంపిక ప్రక్రియలో విద్యార్థుల నుంచి తీసుకున్న అభిప్రాయాల మేరకు కిరణ్‌ పేరును ఎంపికచేశారు. ఈ నెల 15న హైదరాబాద్‌ క్యాంపస్‌లో జరిగే స్నాతకోత్సవంలో ప్రత్యేక పురస్కారాన్ని కిరణ్‌ అందుకోనున్నారు. కిరణ్‌ తండ్రి పేడాడ రాంబాబు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని