logo

Road Accident: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వైద్యుడితో పాటు కుమారుడు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి పలాసకు వెళ్తున్న కారు జాతీయ రహదారిపై ఉన్న వంతెన రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఈఘటనలో ఓ వైద్యాధికారితో పాటు అతడి కుమారుడు మృతి చెందాడు.  

Updated : 14 Nov 2022 05:44 IST

శ్రీకాకుళం: జిల్లాలోని నందిగాం మండలం పెద్దనాయుడుపేట వద్ద సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పలాసకు వస్తున్న వైద్యాధికారి కారు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఉన్న వంతెన రక్షణ గోడను వీరి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న పలాస ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మడే రమేష్(45)తో పాటు అతడి కుమారుడు సంకల్ప్(10) అక్కడికక్కడే మృతి చెందారు. వైద్యాధికారి భార్య ప్రసన్న లక్ష్మి(45), కుమార్తె సైర్య(14)కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని