logo

అన్నదాతలకు పెద్దపీట: స్పీకర్‌

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు పెద్దపీట వేస్తోందని, విపత్తుల సమయాల్లోనూ ఆదుకుంటోందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

Published : 29 Nov 2022 06:07 IST

నమూనా చెక్కును అందిస్తున్న స్పీకర్‌ తమ్మినేని, మంత్రి  ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్‌ లఠ్కర్‌

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు పెద్దపీట వేస్తోందని, విపత్తుల సమయాల్లోనూ ఆదుకుంటోందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సున్నావడ్డీ రాయితీని సోమవారం వర్చువల్‌ విధానంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్‌ తమ్మినేని, మంత్రి ధర్మాన ప్రసాదరావు, జడ్పీ అధ్యక్షురాలు పి.విజయ, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పాల్గొన్నారు. 1,42,893 మంది రైతుల ఖాతాల్లో రూ.28.08 కోట్ల వడ్డీ రాయితీ మంజూరు చేసినట్లు స్పీకరు తెలిపారు. రబీ 2020-21లో 28,289, ఖరీఫ్‌లో 2021లో 59,726, గతేడాది వడ్డీ రాయితీ జమకాని 54,878 మందికి పై మొత్తం ఖాతాల్లో జమ చేశామన్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న పంటలకు  నష్టపరిహారం కింద 3,398 మందికి     రూ.1.15 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, డీసీసీబీ ఛైర్మన్‌ కె.రాజేశ్వరరావు, కేంద్రమాజీ మంత్రి కె.కృపారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని