logo

ఐఆర్‌ దళానికి 630 మంది కేటాయింపు!

జిల్లా పోలీసు శాఖకు భద్రతాపరంగా మరింత అండ చేకూరనుంది. ప్రస్తుతం సివిల్‌తో పాటు ఏఆర్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

Published : 29 Nov 2022 06:16 IST

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు శాఖకు భద్రతాపరంగా మరింత అండ చేకూరనుంది. ప్రస్తుతం సివిల్‌తో పాటు ఏఆర్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్మ్‌డ్‌ రిజర్వు బెటాలియన్‌ ఎచ్చెర్లలో ఉంది. ఇప్పుడు వీరికి అండగా త్వరలో జిల్లాకు ఐఆర్‌ (ఇండియన్‌ రిజర్వు బెటాలియన్‌) రానుంది. 630 మందితో కూడిన ఈ దళం ఏర్పాటు కానుంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు నియామక పోస్టుల్లో ఇవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం ఏఆర్‌ బెటాలియన్‌లో 350 మంది బీడీ టీం, ఎస్కార్ట్‌, మంత్రుల పర్యటనలు, రోఫ్‌పార్టీ, కూంబింగ్‌, గన్‌మెన్లు, డ్రైవర్లు, గార్డులు, ఎన్నికల విధులు, బందోబస్తు, రూఫ్‌టాఫ్‌లు, డాగ్‌స్వ్కాడ్‌ ఇలా అన్ని విధుల్లోనూ వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. కొత్తగా వచ్చే దళ సభ్యులు ఉగ్రవాదం అణచివేత, ప్రకృతి విపత్తుల సమయంలో సేవలు అందించనున్నారు. ఏఆర్‌ బెటాలియన్‌ దగ్గరలోనే ఐఆర్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నారు. ఇరు దళాలు సంయుక్తంగా విధులు నిర్వర్తిస్తారు. మరోపక్క సివిల్‌ పోలీసుల నియామకాల్లో కూడా వందమందిని జిల్లాకు కేటాయించారు. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లాలో భద్రతా అవసరాలు కొంతమేర తీరనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని