logo

చెట్ల కింద చదువులు..

గదుల్లో సామగ్రినేలపై కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థుల చిత్రాలు కోటబొమ్మాళి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోనివి. ఇంటర్మీడియట్‌ రెండు సంవత్సరాల విద్యార్థులు గత నాలుగు రోజులుగా ఇలాగే నేలపై కూర్చొని అవస్థలు పడుతున్నారు

Updated : 29 Nov 2022 06:57 IST

మరమ్మతులు చేసిన గదిలో బెంచీల ఏర్పాటు

గదుల్లో సామగ్రినేలపై కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థుల చిత్రాలు కోటబొమ్మాళి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోనివి. ఇంటర్మీడియట్‌ రెండు సంవత్సరాల విద్యార్థులు గత నాలుగు రోజులుగా ఇలాగే నేలపై కూర్చొని అవస్థలు పడుతున్నారు. ఇందుకు కారణం కొన్ని తరగతి గదులకు నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఓ గదిలో ప్రిన్సిపల్‌ ఛాంబరు, కార్యాలయాన్ని నిర్వహిస్తుండగా, బయట వరండాలో బెంచీలకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో చెట్లకింద చదువులు తప్పనిసరైంది. మరో మూడు రోజులు పనులు జరగనున్నాయని, వేగంగా పనులు పూర్తిచేసి గదుల్లో తరగతులు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్‌ ఇందిరాకుమారి తెలిపారు. బెంచీల పని పూర్తయిన వెంటనే మార్పులు చేస్తామన్నారు.

- న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని