logo

శివాలయంలో వెండి ఆభరణాల చోరీ

టెక్కలిలోని చేరివీధి వద్దనున్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది.

Updated : 29 Nov 2022 13:55 IST

టెక్కలి పట్టణం  :  టెక్కలిలోని చేరివీధి వద్దనున్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసిన దుండగులు తలుపులు పగులుగొట్టి గుడిలోకి ప్రవేశించారు. నాగాభరణం, శఠగోపాలు, పంచపాత్రలు, ఉద్ధరిణులు, వెండి పల్లెం సహా ఆరు కిలోల బరువైన ఆభరణాలు చోరీ చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు నమోదైన హార్డ్ డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే ఈ విషయం గుర్తించిన అర్చకుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో టెక్కలి సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్సై మహమ్మద్‌ అలీ ఆలయాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని