logo

రోడ్డెక్కి న్యాయవాదుల నిరసన

టెక్కలిలో న్యాయవాదులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. శిథిలమైన టెక్కలి సబ్‌కోర్టు భవనాన్ని తక్షణమే మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated : 29 Nov 2022 13:56 IST

టెక్కలి పట్టణం : టెక్కలిలో న్యాయవాదులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. శిథిలమైన టెక్కలి సబ్‌కోర్టు భవనాన్ని తక్షణమే మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. కోర్టు ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్‌ రహదారిపై నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం కోర్టు గేటు వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. సమస్యను పరిష్కరించే వరకు విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. శిథిలావస్థలో ఉన్న కోర్టును మూడేళ్ల క్రితం పాత ఎంపీడీవో కార్యాలయ భవనంలోకి మార్పు చేశారని, ప్రస్తుతం అది కూడా శిథిలమైందని చెప్పారు. టెక్కలిలోని జిల్లా ఆస్పత్రి పాత భవనంలో ఉన్న ప్రసూతి విభాగం పాత భవనంలోకి తరలించాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే ప్రభుత్వం అందుకు అనుమతి మంజూరు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని