logo

జీవితాల్లో వెలుగులు రావాలి: కలెక్టర్‌

చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తూ ఆబ్కారీ శాఖకు పట్టుబడిన వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు.

Published : 30 Nov 2022 05:57 IST

నమూనా చెక్కు అందిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌  బి.లఠ్కర్‌, చిత్రంలో ఎస్పీ రాధిక, తదితరులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తూ ఆబ్కారీ శాఖకు పట్టుబడిన వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ‘పరివర్తన 2.0’ కింద ఆసరా పొందుతున్న 34 కుటుంబాలకు రూ.11 లక్షల నమూనా చెక్కును కలెక్టర్‌, ఎస్పీ జి.ఆర్‌.రాధిక మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డీఆర్‌డీఏ సహకారంతో పాత ఆబ్కారీ నేరస్తులకు అందిస్తున్న ఆర్థిక సాయంతో వారి జీవితాల్లో వెలుగులు రావాలని ఆకాంక్షించారు. నీతి, నిజాయతీతో జీవనం సాగించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన సహకారంతో ఉన్నతంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్‌, సహకార బ్యాంకు సీఈవో వరప్రసాద్‌, యూనియన్‌ బ్యాంకు ప్రాంతీయ మేనేజరు గురునాథరావు, ఎల్‌డీఎం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని