logo

అనుమతి ఇచ్చి నిర్బంధిస్తారా?

ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టగా ప్రభుత్వం స్పందించ లేదని, రాష్ట్రస్థాయిలో విజయవాడలో ధర్నాకు అనుమతి ఇచ్చి...

Published : 30 Nov 2022 05:57 IST

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్రకు నోటీసు ఇస్తున్న కానిస్టేబుల్‌

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టగా ప్రభుత్వం స్పందించ లేదని, రాష్ట్రస్థాయిలో విజయవాడలో ధర్నాకు అనుమతి ఇచ్చి మరోవైపు నిర్బంధాలకు గురిచేయడం తగదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదర రవీంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.కిశోర్‌కుమార్‌ మండిపడ్డారు. జిల్లాలోని  మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులను నిర్బంధించి బైండోవర్‌ కేసులు నమోదు చేయడం తగదన్నారు. కేసులు ఉపసంహరించకపోతే భవిష్యత్తు పోరాటాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని