logo

టెక్కలిలో న్యాయవాదుల నిరసన

టెక్కలిలో న్యాయవాదులు రోడ్డెక్కి మంగళవారం నిరసన తెలిపారు. కోర్టు భవనాన్ని పాత జిల్లా ఆసుపత్రి ప్రసూతి భవనంలోకి మార్చాలని నాలుగు నెలలుగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని సబ్‌కోర్టు ఎదురుగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

Published : 30 Nov 2022 05:57 IST

టెక్కలిలో న్యాయవాదులు రోడ్డెక్కి మంగళవారం నిరసన తెలిపారు. కోర్టు భవనాన్ని పాత జిల్లా ఆసుపత్రి ప్రసూతి భవనంలోకి మార్చాలని నాలుగు నెలలుగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని సబ్‌కోర్టు ఎదురుగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రస్తుతం కోర్టు భవనం శిథిలం కావడంతో ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల నిరసనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవి ధర్మరాజు, ఎస్‌ఎస్‌ రాజు పాల్గొన్నారు.      

 - న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని