logo

సౌకర్యాల లేమి.. గర్భిణికి అవస్థలు

ఆసుపత్రిలో వసతి, ఇతర సౌకర్యాల కొరతతో ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణికి కాన్పు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Published : 30 Nov 2022 05:57 IST

తల్లి, బిడ్డతో ఆశ్రమ నిర్వాహకురాలు పద్మావతి

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: ఆసుపత్రిలో వసతి, ఇతర సౌకర్యాల కొరతతో ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణికి కాన్పు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ సమీప కోసంగిపురం కూడలిలోని లలితా ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందుతున్న ఓ గర్భిణికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే ఆశ్రమ నిర్వాహకురాలు పద్మావతి ఆమె కారులో అక్కుపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్ష చేసిన వైద్యురాలు దివ్య రక్తపోటు ఎక్కువగా ఉండటం,  రక్తహీనతతో బాధపడుతుండటం గమనించారు. పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఉన్నందున అందుకు తగిన సౌకర్యాలు లేవని, పలాస పీహెచ్‌సీకి వెళ్లాలని సూచించారు. దీంతో చేసేది లేక తిరిగి కాశీబుగ్గ తీసుకొస్తుండగా తాళభద్ర రైలుగేటు సమీపంలో పురిటి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. పద్మావతి సపర్యలు చేయగా అక్కడే ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కుపల్లి పీహెచ్‌సీలోనే పనిచేస్తున్న భారతి అనే ఏఎన్‌ఎంకు సమాచారం ఇవ్వడంతో ఆమె చేరుకొని వైద్య సేవలందించారు.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని