logo

జాతీయస్థాయి నృత్య పోటీల్లో ప్రతిభ

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బెంగళూరులో వరల్డ్‌ ఫోరం ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి కూచిపూడి నృత్య పోటీల్లో శ్రీకాకుళం నగరానికి చెందిన కొమ్ము చేతన ప్రియ, కొమ్ము మోహిత్‌ కుమార్‌ ప్రతిభ చూపారు.

Published : 30 Nov 2022 06:18 IST

గురువు శ్రీకాంత్‌తో చేతన ప్రియ, మోహిత్‌కుమార్‌

శ్రీకాకుళం సాంస్కృతికం న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బెంగళూరులో వరల్డ్‌ ఫోరం ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి కూచిపూడి నృత్య పోటీల్లో శ్రీకాకుళం నగరానికి చెందిన కొమ్ము చేతన ప్రియ, కొమ్ము మోహిత్‌ కుమార్‌ ప్రతిభ చూపారు. గత ఆగస్టులో ప్రారంభమైన పోటీల్లో 5 వేల మంది పాల్గొన్నారు. అందులో తుదిపోటీలకు ఏడుగురిని ఎంపిక చేశారు. వారిలో జిల్లాకు చెందిన చేతనప్రియ, మోహిత్‌ కుమార్‌ ఉన్నారు. ఈ ఇద్దరిలో చేతన ప్రథమ స్థానం సాధించిందని శివశ్రీ నృత్య కళానికేతన్‌ సంచాలకులు డా.శ్రీకాంత్‌ రఘుపాత్రుని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 3వ తేదీన ఆన్‌లైన్‌లో తుది పోటీలు జరిగాయని, వచ్చే ఏడాది జనవరిలో బెంగుళూరు వేదవిజ్ఞాన్‌ మహావిద్యాపీఠంలో జరిగే కార్యక్రమంలో అవార్డు, ధ్రువపత్రం ఇస్తారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని