logo

అగ్నిప్రమాదంలో దుకాణాలు దగ్ధం

హిరమండలం పంచాయతీ ఏబీ రహదారి పక్కన బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన అగ్ని ప్రమాదంలో పలు దుకాణాలు కాలిపోయాయి.

Published : 02 Dec 2022 04:34 IST

రూ.10 లక్షల ఆస్తి నష్టం!

కాలిపోయిన వస్త్ర, కూరగాయల దుకాణాలు

హిరమండంలం, న్యూస్‌టుడే: హిరమండలం పంచాయతీ ఏబీ రహదారి పక్కన బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన అగ్ని ప్రమాదంలో పలు దుకాణాలు కాలిపోయాయి. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వేకువజాము 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు గుర్తించి విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయించారు. వెంటనే కొత్తూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో అంధవరపు వెంకటరమణమూర్తికి చెందిన దుస్తుల దుకాణంలోని వస్త్రాలతో పాటు కె.ఏడుకొండలు, కె.ధనుంజయ, జి.రామారావు, కె.దుర్యోధన, ఎ.శాంతారావులకు చెందిన కూరగాయలు, పూల దుకాణాల్లో సామగ్రి కాలి బూడిదైంది. ఆస్తినష్టం రూ.10 లక్షల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. తహసీల్దారు బి.మురళీమోహనరావు సంఘటనా ప్రాంతాన్ని పరశీలించారు. ఈ విషయమై పోలీసులను అడగగా తమకు ఫిర్యాదు అందితే దర్యాప్తు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని