logo

ఆరు గంటల్లోనే నిర్మించేశారు..

జిల్లాలో రెండు చోట్ల గురువారం రైల్వే అండర్‌ పాస్‌ వంతెనలను నిర్మించారు. ఆరు గంటల్లో యుద్ధప్రాతిపదికన అధికారులు ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు భారీ క్రేన్లు, పొక్లెయిన్లను వినియోగించారు.

Published : 02 Dec 2022 04:34 IST

చిక్కాలవలస రైల్వే గేటు వద్ద ఏర్పాటు చేసిన సిమెంట్‌ నిర్మాణం

జిల్లాలో రెండు చోట్ల గురువారం రైల్వే అండర్‌ పాస్‌ వంతెనలను నిర్మించారు. ఆరు గంటల్లో యుద్ధప్రాతిపదికన అధికారులు ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు భారీ క్రేన్లు, పొక్లెయిన్లను వినియోగించారు. రైల్వేలోని వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, కార్మికులు ఇందులో భాగస్వాములయ్యారు. ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామం వద్ద మధ్యాహ్నం 2.10 నుంచి రాత్రి 8.25 గంటల మధ్య ఒకటి, దాదాపు అదే సమయంలో నరసన్నపేట మండలం ఉర్లాం రైలు నిలయానికి సమీపంలో చిక్కాలవలస రైల్వే గేటు వద్ద మరో అండర్‌ పాస్‌ వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రక్రియ పూర్తయ్యాక యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగాయి. దీని వల్ల ప్రయాణికులకు ఆయా ప్రాంతాల్లో రైల్వే గేటు ఇబ్బందులు తీరనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.


పలు రైళ్లు రద్దు: రైల్వే అండర్‌ పాస్‌ వంతెన నిర్మాణాల్లో భాగంగా గురువారం పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. విశాఖపట్నం-భువనేశ్వర్‌, భువనేశ్వర్‌-విశాఖపట్నం, బ్రహ్మపుర-విశాఖపట్నం, విశాఖపట్నం-బ్రహ్మపుర, విశాఖపట్నం-పలాస, పలాస-విశాఖపట్నం రైళ్లను రద్దు చేశారు. కోణార్క్‌, ఫలక్‌నుమా, బెంగళూర్‌-గౌహతి, భువనేశ్వర్‌-చెన్నై, విశాఖపట్నం-దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సుమారు 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా నడిచాయి.


- న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం, నరసన్నపేట గ్రామీణం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని