logo

ఇచ్ఛాపురం టు అరకు

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ జాతీయ రహదారుల విస్తరణ జరుగుతోంది. పాచిపెంట మండలంలో గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి, రాజమహేంద్రవరం నుంచి అరకు మీదుగా విజయనగరాన్ని అనుసంధానం చేసేలా ఎన్‌హెచ్‌ 516ఈ రూపుదిద్దుకొంటున్నాయి.

Published : 03 Dec 2022 01:59 IST

వయా పార్వతీపురం

కొత్తగా జాతీయ రహదారికి ప్రతిపాదనలు

ప్రతిపాదిత రహదారి పటం

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ జాతీయ రహదారుల విస్తరణ జరుగుతోంది. పాచిపెంట మండలంలో గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి, రాజమహేంద్రవరం నుంచి అరకు మీదుగా విజయనగరాన్ని అనుసంధానం చేసేలా ఎన్‌హెచ్‌ 516ఈ రూపుదిద్దుకొంటున్నాయి. వీటితో పాటు అరకు నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేస్తే గిరిజన ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందనేది ప్రతిపాదన ఉద్దేశం.  

నాలుగు ఎన్‌హెచ్‌లతో కలయిక..

ఇచ్ఛాపురం, మందస, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, బత్తిలి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, మక్కువ, సాలూరు, లోతేరు, అరకు వరకు రోడ్డు ప్రతిపాదించారు. ఇది సాలూరు వద్ద విశాఖ-రాయ్‌పూర్‌ (ఎన్‌హెచ్‌ 26),  కొత్తగా నిర్మితమవుతున్న సబ్బవరం-రాయ్‌పూర్‌ (ఎన్‌హెచ్‌ 130సీడీ), ఇచ్ఛాపురం వద్ద చెన్నై-కోల్‌కతా (ఎన్‌హెచ్‌26), అరకు వద్ద విజయనగరం-రాజమహేంద్రవరం రహదారికి అనుసంధానం అయ్యేలా ప్రణాళిక రూపొందించారు.

ఎకో టూరిజానికి వెన్నుదన్ను

ఈ రహదారి సాకారమైతే 560 కిలోమీటర్ల పొడవున పర్యాటక రంగానికి ఆలవాలంగా నిలుస్తుంది. బీ మందస, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, అరకు, లంబసింగి, మారేడుమిల్లి, రంపచోడవరం, పోలవరం, రాజమహేంద్రవరం వరకు పర్యాటక క్లస్టరుగా మారనుంది. బీ ఇప్పటికే 320 కిలోమీటర్ల మేర జాతీయ, గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల పనులు జరుగుతున్న నేపథ్యంలో మరో 240 కిలోమీటర్ల మేర నిర్మిస్తే సరిపోతుంది.


ఉపాధి అవకాశాలు

ఇచ్ఛాపురం నుంచి అరకు వరకు జాతీయ రహదారి ఏర్పాటుకు, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించాం. ఇవి అమలైతే మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతంలోనే   ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. గిరిజన ఉత్పత్తులను ఒడిశా, పశ్చిమబంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని మార్కెట్‌కు తరలించే అవకాశం కలుగుతుంది.  

- నారాయణరావు, మన్యం జిల్లా పర్యాటక శాఖ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని