logo

సకాలంలో సదరం ధ్రువపత్రాలు

సకాలంలో సదరం ధ్రువపత్రాలు మంజూరయ్యేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు.

Published : 04 Dec 2022 06:00 IST

విజేతకు జ్ఞాపిక అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: సకాలంలో సదరం ధ్రువపత్రాలు మంజూరయ్యేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో విభిన్నప్రతిభావంతులశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్నప్రతిభావంతుల దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వావలంబన యాప్‌ ద్వారా 46 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. అనంతరం 18 మందికి ల్యాప్‌టాప్‌లు, 27 మందికి రూ.87 లక్షల రుణాలు, 36 మందికి మూడు చక్రాల వాహనాలు, నలుగురికి స్మార్ట్‌ఫోన్లు, 10 మందికి ట్రై సైకిళ్లు బెహర మనోవికాస కేంద్రం విద్యార్థుల లఘ నాటిక, నృత్యప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముందుగా క్రీడాపోటీల విజేతలకు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు పి.విజయ, ఎమ్మెల్సీ సురేష్‌కుమార్‌, విభిన్న ప్రతిభావంతులశాఖ ఏడీ ఎం.కిరణ్‌కుమార్‌, డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు, జిల్లా పర్యాటకశాఖ అధికారి ఎన్‌.నారాయణరావు, సెట్‌శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు, ఏడీఎంహెచ్‌వో ఎన్‌.అనురాధ, జిల్లా ఉద్యోగ కల్పనాధికారి జి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని