logo

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: స్పీకర్‌

ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, ఈ విషయంలో ఫిర్యాదులు వస్తే సహించేదిలేదని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.

Published : 04 Dec 2022 06:00 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, ఈ విషయంలో ఫిర్యాదులు వస్తే సహించేదిలేదని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మండల కేంద్రంలోని తమ్మినేని శ్రీరామ్మూర్తి కళాప్రాంగణంలో డీసీఎంఎస్‌ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేయాలన్నారు. ఈ విషయంలో రైతులు అపోహలు వీడాలన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ఫిర్యాదుల విభాగం బాక్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు రీసర్వే భూహక్కు పత్రాలను రైతులకు అందజేశారు. జడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌, మండల పార్టీ కన్వీనర్‌ బి.మల్లేశ్వరరావు, బి.చామంతి, తహసీల్దార్‌ బి.రమేష్‌కుమార్‌, ఏడీఏ బి.రాజగోపాలరావు, ఏవో పద్మనాభం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని