logo

మా కష్టాలు తీర్చండి..!

శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం, ఇతర ప్రోత్సాహకాలు అందించారు.

Published : 04 Dec 2022 06:00 IST

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం, ఇతర ప్రోత్సాహకాలు అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. వారిని ‘న్యూస్‌టుడే’ పలకరించంగా సమస్యలను తెలియజేశారు. వాటిని పరిష్కరించాలని జిల్లా అధికారులనూ కోరారు.


అంత్యోదయ కార్డులివ్వాలి...
- మల్లారెడ్డి భాస్కరరావు, సొండిపూడి, మందస

విభిన్నప్రతిభావంతులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. అర్హులందరికీ మోటారు వాహనాలు, నిబంధనలు లేకుండా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. అవివాహితులైన దివ్యాంగులకు ఇళ్లు కేటాయించాలి.  


 21 నెలలుగా జీతం లేదు..
- యాళ్ల నిర్మల

నేను ఎల్‌ఎన్‌పేట మండల పరిషత్తు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. 21 నెలలుగా జీతం అందడం లేదు. అధికారులను అడిగితే మీనమేషాలు లెక్కిస్తున్నారు. కలెక్టర్‌ చర్యలు తీసుకొని వేతనాలు ఇప్పించాలి.


 క్రీడాకారులను ఆదుకోండి..
- సీహెచ్‌ పూర్ణారావు, టెక్కలి

దివ్యాంగ క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం అందడం లేదు. నేను వీల్‌ఛైర్‌ బ్యాడ్మింటన్‌లో సాధన చేస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యే సమయంలో ప్రత్యేక శిక్షణ, క్రీడాసామగ్రి, రవాణా తదితర అవసరాలు ఆర్థిక భారంగా మారుతున్నాయి. జిల్లా నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు వెలుగులోనికి వస్తారు.


పాఠశాలల్లో వసతులు కల్పించాలి..
- పిన్నింటి కావ్య, శ్రీలక్ష్మి, శ్రీకాకుళం

పాఠశాలలో విభిన్నప్రతిభావంతులు చదువుకునేందుకు వీలుగా వసతులు కల్పించాలి.   బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో దివ్యాంగుల విభాగంలో కొలువులు కేటాయించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని