logo

పోరాటాలకు సిద్ధంకండి

పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్‌ పిలుపునిచ్చారు.

Updated : 04 Dec 2022 06:18 IST

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్‌

జెండాలతో ర్యాలీగా వస్తున్న మహిళా కార్మికులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్‌ పిలుపునిచ్చారు. సీఐటీయూ శ్రీకాకుళం జిల్లాశాఖ 11వ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. కార్మికులంతా ఎర్రజెండాలతో శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలి నుంచి డైమండ్‌ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ సిబ్బందికి తెలంగాణ మాదిరిగా వేతనాలిస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదన్నారు. ఏ రంగంలోని కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్‌బాబు, పి.తేజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని