logo

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

హిరమండలం మేజరు పంచాయతీ చిన్నకోరాడకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 08 Dec 2022 05:32 IST

హిరమండలం, న్యూస్‌టుడే: హిరమండలం మేజరు పంచాయతీ చిన్నకోరాడకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంగూరు పకీరు(44) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తాగొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఆయన భార్య శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.నారాయణస్వామి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని